బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (12:46 IST)

'నెల్లూరు చేపల పులుసు' వంట ఛాలెంజ్‌ను స్వీకరించిన చెర్రీ

Anushka, naveen
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి". శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చాలా వెరైటీగా చేపట్టారు. రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది. తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌కు ఛాలెంజ్ విసిరింది. తనకు ఇష్టమైన వంటకాన్ని తయారు చేసి అందరితో పంచుకున్నానని, ఇపుడు ఈ సవాల్‌ను ప్రభాస్‌కు విసురుతున్నట్టు చెప్పింది. 
 
ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్.. తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమంటూ వెల్లడించి, దాన్ని ఎలా తయారు చేయాలో వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌కు ఛాలెంజ్ విసిరాడు. దీనిపై చెర్రీ కూడా స్పందించాడు. తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. దాని తయారీ విధానాన్ని వివరించాడు. ఆ తర్వాత మరో హీరో రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. అలాగే, శుక్రవారం రిలీజ్ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.