సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:37 IST)

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టం..

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు అనుష్క వెరైటీగా ప్రమోషన్‌ను ప్రారంభించింది. రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్ చేపట్టింది. 
 
తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆపై తనకు ఇష్టమైన వంటకాన్ని అందరితో పంచుకున్నానని.. ఇప్పుడు ఛాలెంజ్‌ను ప్రభాస్‌కు విసురుతున్నానని తెలిపింది.  
 
ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాన్ని ఎలా చేయాలో షేర్ చేశాడు. ఆపై రామ్ చరణ్‌కు ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్‌కు చెర్రీ కూడా స్పందించాడు. 
 
తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని తెలిపాడు. దాని తయారీ విధానాన్ని కూడా వివరించాడు. రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు.