ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (21:52 IST)

హ్యాపీ బర్త్ డే టు అనుష్క శెట్టి

Anushka shetty
Anushka shetty
ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో  హీరోల‌కు స‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. 
 
ఆమె న‌టించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్  చేశాయి. రీసెంట్‌గా అనుష్క నటించిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 
 
ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే  కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా.
 
 
 
అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా  హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్‌లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 
 
అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. 
 
నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే అందం,అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 
 
 
 
బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. 
 
చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. 
 
అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా "భాగమతి-2"ని యూవీ క్రియేషన్స్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు.
 
ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్.