1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (11:40 IST)

కుర్రకారుని కైపుగా వెక్కిరిస్తున్న రష్మిక మందన్నా

Rashmika Mandanna
Rashmika Mandanna
సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది రష్మిక మందన్నా. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన జిమ్ సూట్  ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జిమ్‌లోంచి బయటకు వస్తూ ట్రాక్, ఫుల్ హ్యాండ్స్ టైట్ టాప్‌తో శ్రీవల్లి ఒకరకమైన స్మైలీ లుక్స్‌తో కుర్రకారుని కైపుగా వెక్కిరిస్తున్నాయి.
 
చెమటలు కక్కేలా జిమ్ చేయడంతో ఎనర్జీ కోసం ప్రొటీన్ డ్రింక్ బాటిల్ ను కూడా చేతిలో పట్టుకుని తను మార్నింగ్ డ్రింగ్ గురించి చెప్పకనే చెప్పేసింది. అయితే ఆమధ్య విజయ్ దేవరకొండతో విదేశాల్లో సముద్రతీరాన వున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంతవరకు వారిద్దరి మధ్య రిలేషన్ క్లారిటీ రాలేదు. 
 
లేటెస్ట్ గా పుష్ప సీక్వెల్ లో నటిస్తున్న రష్మిక ఆ సినిమాపై పూర్తి నమ్మకంతో వుంది. ఈ సినిమా మూడో భాగం కూడా కొంత పార్ట్ తీశారనే టాక్ కూడా వుంది.