విక్రమ్ - నయనతారల 'ఇంకొక్కడు' సెన్సార్ పూర్తి.. 8న విడుదల
విక్రమ్ హీరోగా నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ''ఇరుముగన్''. ఈ చిత్రం ''ఇంకొక్కడు'' అనే టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోండగా
విక్రమ్ హీరోగా నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ''ఇరుముగన్''. ఈ చిత్రం ''ఇంకొక్కడు'' అనే టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోండగా థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిభు థమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిచారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఆనంద్‌శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని... సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని దర్శకుడు తెలిపారు. ఇటు హీరోగా అటు విలన్‌గా విక్రమ్ మరోసారి తన నటనను ప్రదర్శించనుండగా.. లవ్ అనే పాత్ర సినిమాకే హైలైట్‍గా నిలుస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. తెలుగు వర్షన్‌లో రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తుంది.

