1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Young Hero's Bouncers Insult Sr Actress Jamuna

బలవంతంగా నెట్టేసిన బౌన్సర్లు.. తూలిపడిన అలనాటి నటి... ఎవరు?

అలనాటికి ఘోర అవమానం జరిగింది. సినీ బౌన్సర్లు సీనియర్ నటి అనే భావన కూడా లేకుండా బలవంతంగా నెట్టేశారు. దీంతో ఆమె తూలిపడిపోయారు. ఆ అలనాటి నటి ఎవరో కాదు.. జమున. అలనాడు ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అ

Jamuna
అలనాటికి ఘోర అవమానం జరిగింది. సినీ బౌన్సర్లు సీనియర్ నటి అనే భావన కూడా లేకుండా బలవంతంగా నెట్టేశారు. దీంతో ఆమె తూలిపడిపోయారు. ఆ అలనాటి నటి ఎవరో కాదు.. జమున. అలనాడు ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 
 
అయితే, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి ఆమె వెళ్లారు. అంగరంగవైభోగంగా జరిగిన ఆ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. జమున కూడా వెళ్లారు. ఆమె వెళుతున్న సమయంలోనే ఓ యువ హీరో కూడా అప్పుడే వివాహానికి దర్జాగా తన చుట్టూత పది మంది బౌన్సర్లు పెట్టుకుని వచ్చాడు. 
 
ఆసమయంలో అటుగా వెళుతున్న జమునను చూసి ఏమనుకున్నారో ఏమో గానీ, బౌన్సర్లు ఆమెను అమాంతం పక్కకు తోసేశారట. వారి బలానికి ఒక్కసారిగా ఆమె తూలి కిందపడిపోయారట. అనంతరం ఆమెను కనీసం లేపకపోగా, ఆ యువ హీరో ఆమెను చూసీచూడనట్టు వెళ్లిపోయాడట. కనీసం ఆమె వయసుకు తగిన గౌరవం ఇవ్వకుండా అలాంటి పనిచేసినందుకు చిన్న సారీ కూడా చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నాడట. 
About Writer
pnr
తర్వాతి కథనం
'చుక్కలు' చూపించిన కృష్ణవంశీ...