శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (14:45 IST)

అమలా పాల్ గ్లామర్ ఆ లుక్‌లో అదిరింది గురూ...?

వివాహమైనా కెరీరే ముఖ్యమంటూ భర్త నుంచి దూరమై, అందిన అవకాశాలను చేసుకుంటూ పోతున్న అమలాపాల్ వీఐపీ-2కి తర్వాత కొత్త సినిమా తిరుట్టుపయళె- 2లో నటిస్తోంది. సుశిగణేశన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తిరుట్టుపయ

వివాహమైనా కెరీరే ముఖ్యమంటూ భర్త నుంచి దూరమై, అందిన అవకాశాలను చేసుకుంటూ పోతున్న అమలాపాల్ వీఐపీ-2కి తర్వాత కొత్త సినిమా తిరుట్టుపయళె- 2లో నటిస్తోంది. సుశిగణేశన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తిరుట్టుపయలె-2కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్‌లో అమలా పాల్ గ్లామర్ అదిరిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియాలో లైక్స్ కుమ్మేస్తున్నారు.
 
సుశీగణేశన్ దర్శకత్వంలో 2006లో తిరుట్టుపయలె సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో జీవన్, సోనియా అగర్వాల్, మాళవిక తదితరులు నటించారు. ఈ  చిత్రంలో మాళవిక రొమాన్స్ సీన్స్ అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఈ గ్లామర్ వసూళ్లను బాగా పెంచేసింది.
 
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇందులో బాబీ సింహా, అమలా పాల్ రొమాన్స్ అదిరింది. తొలి పార్ట్ తరహాలోనే సీక్వెల్‌లోనూ హాట్ మసాలా జోడించేందుకు సుశీ సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో అమలాపాల్ లుక్కెలాగుందో చూడండి..