Nayanatara, Prabhudeva, tattoo, Tollywood, cinema | నయనతార ఎదపై "దేవ" రహస్యం!
నయనతార- ప్రభుదేవాల మధ్య మొలకెత్తిన బంధం మరింత ముదిరి పాకానపడి పచ్చబొట్టు పొడిపించుకునేవరకూ వెళ్లిపోయింది. ప్రభుదేవా పేరులోని మొదటి అక్షరాన్ని నయనతార పచ్చబొట్టుగా పొడిపించుకుందన్న వార్తలు టాలీవుడ్‌లో సంచరిస్తున్నాయి.
దీనికి బలాన్ని చేకూర్చే విధంగా ఓ సంకేతం కనబడింది. మొన్నామధ్య ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం నయన స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని వచ్చిందట. షూటింగ్ గ్యాప్‌లో నయన ఓ చెట్టు కింద సేద తీరుతుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమేరాల్లో బంధించడానికి ఎగబడ్డారట.
వాళ్ల ఆరాటాన్ని చూసిన నయన, సరేనన్నట్లు వివిధ ఫోజులను ఇచ్చిందట. అయితే ఓ ఫోజులో ఆమె ఎడమచేయి మోచేతి కిందవైపు "P" అనే అక్షరం ఇంగ్లీషులోనూ, ఆ తర్వాత అక్షరాలేవో తమిళంలోనూ కనబడ్డాయిట. ఈ స్టిల్ చూసిన టాలీవుడ్ సినీజనం "P" అంటే ప్రభుదేవా అని వాదిస్తున్నారు.
'P' తర్వాత ఉన్న తమిళ అక్షరాలు ఖచ్చితంగా ప్రభుదేవా పేరుగల అక్షరాలేనని గట్టి నమ్మకంతో ఉన్నారట. ఈ విషయాన్ని నిర్థారించుకునేందుకు కొందరు తెలుగు ఫోటోగ్రాఫర్లు తమిళ ఫోటోగ్రాఫర్లకు తాము తీసిన ఫోటోలను పంపించారట. మరి వాళ్ల పరీక్షలో "p" అనే అక్షరం తర్వాత ఉన్న అక్షరాలు ఏమై ఉంటాయో తేలిపోతుంది.
