1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. నీకు అంత సీను లేదు అనుష్కా...!!

నీకు అంత సీను లేదు అనుష్కా...!!

సెక్సీ తార అనుష్క తలబిరుసు అభిమాని టాలీవుడ్ కోలీవుడ్
సినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు. ఇది చాలా మంది నటీనటుల విషయంలో రుజువైంది కూడాను. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా సెక్సీ నటి అనుష్క కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. వరుస హిట్లు, ఆఫర్లతో అమ్మడికి తలబిరుసు ఎక్కువైందంటున్నారు.

ఎందుకంటారా..? ఆమె నటించిన అరుంధతి చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కాల్షీట్స్ కోసం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎగబడుతున్నాయట. ఇదిలా ఉంటే తమిళనటుడు విజయ్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తాలూకు షూటింగ్ గత కొద్ది రోజులుగా రాజమండ్రిలో జరుగుతోంది.

ఇందులో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తుండగా, ఓ అభిమాని ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడట. అయితే అనుష్క అదేమీ పట్టనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయిందట. అయినా వదలని ఆ వీరాభిమాని అనుష్కను ఆటోగ్రాఫ్‌కోసం పదే పదే బతిమాలాడట.

అయినా ఇవ్వకపోవడంతో చిర్రెత్తిన ఆ అభిమాని, "అరుంథతి హిట్‌తో నీకు పొగరెక్కిందా... అసలు ఆ చిత్రం నీ వల్ల హిట్ అవలేదు. అందులో రాక్షసుడు పాత్ర సోనూసూద్ వల్ల, సాయికుమార్ తమ్ముడు రవి వాయిస్ వల్ల హిట్ అయింద"ని చిందులేశాడట. ఇది చూసిన యూనిట్ సభ్యులు అవాక్కయ్యారట.

అనుష్క ప్రవర్తనను చూసిన యూనిట్ సభ్యులలో కొందరు, పబ్లిక్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి మేడమ్ అన్నారట. చివరికి ఏమనుకుందో ఏమో గానీ తన అభిమానిని పిలిపించమని చెప్పిందట. కానీ అప్పటికే ఆ అభిమాని గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి