1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress kidnapping case, Kavya Madhavan will be arrest

ఎఫైర్ బయటపెట్టిందనీ, ఆ పని చేసి నగ్న ఫోటోలు తీయమన్నాడా...?(వీడియో)

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు బీజం వేసిన మలయాళ స్టార్ హీరో కేవలం వ్యక్తిగత కక్షతోనే ఆమెపై దాడికి కుట్ర పన్నినట్లు పోలీసు విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో అరెస్టయిన మలయాళ అగ్ర హీరో దిలీప్‌ వ్యక్తిగ

Actress kidnapping case
గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు బీజం వేసిన మలయాళ స్టార్ హీరో కేవలం వ్యక్తిగత కక్షతోనే ఆమెపై దాడికి కుట్ర పన్నినట్లు పోలీసు విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో అరెస్టయిన మలయాళ అగ్ర హీరో దిలీప్‌ వ్యక్తిగత కక్షతోనే హీరోయిన్‌పై దాడికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను కోర్టు రెండురోజుల విచారించేందుకు కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. నటిపై కారులో లైంగిక వేధింపులు చోటుచేసుకున్న త్రిశూర్‌ ప్రాంతానికి దిలీప్‌ను తీసుకెళ్లి ఇంటరాగేషన్‌ చేసి.. కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
 
2013 లోనే నటిపై దాడి కుట్రకు బీజం పడినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. 2013లో దిలీప్‌ ఓ వ్యక్తికి రూ. 1.5 కోట్లు ఇచ్చి.. నటిపై దాడి చేసి ఆ ఘటనను రికార్డు చేయాలని, ఆమెను నగ్నంగా ఫొటోలు తీయాలని కోరాడని ఆ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగతంగా నటిపై పగ తీర్చుకోవడానికి ఆయన ఈ కుట్రకు తెరతీశాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తన మొదటి భార్య మంజు వారియర్‌తో వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడానికి కారణం నటియేనన్న కారణంతో ఆయన పగ పెంచుకున్నారని తెలుస్తోంది. 
 
కావ్యా మాధవన్‌తో తనకు ఉన్న ఎఫైర్‌ గురించి మంజు వారియర్‌కు నటి చెప్పడంతోనే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. మంజు వారియర్‌తో విడిపోయిన అనంతరం ఇటీవల దిలీప్‌ కావ్యా మాధవన్‌ను పెళ్లాడారు. వ్యక్తిగత పగతోనే నటిపై ఇంతటి అమానుష దాడి చేయించాడని పోలీసులు ఆరోపిస్తుండగా.. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని నటుడు దిలీప్‌ అంటున్నారు. చూడండి వీడియో...
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
కొండ‌ప‌ల్లి ఖిల్లాకు కొత్త క‌ళాకాంతులు... రూ.4కోట్ల వ్య‌యంతో హంగులు(ఫోటోలు)