సంబంధిత వార్తలు
- ''టార్చ్‌లైట్'' ట్రైలర్.. సదా అందాలు.. జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా? (Trailer)
- మహేష్ బాబు చేతులు మీదుగా 'మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ రిలీజ్
- వెంకీ మామ టీజర్ వచ్చేసింది... రెస్పాన్స్ ఏంటి?
- ‘జైహింద్ కాదు సార్, జీహాద్ అనాలి’... ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగ్
- రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా ‘బ్యూటిఫుల్’... ఇంతకీ కథ ఏంటో తెలుసా..?
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ మూవీ ట్రైలర్ రిలీజ్..!
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తొలిసారి వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఆదిత్య వర్మ. ఈ-4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ముఖేష్ మెహతా నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు గిరిసాయా దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు అర్జున్ రెడ్డి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నూతన నటి బనిత సందూ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
ఇకపొతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ మంగళవారం అధికారికంగా రిలీజ్ చేస్తున్నారు. ప్రియా ఆనంద్ మరొక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ధృవ్‌కు స్నేహితుడిగా అన్బుతసన్ నటిస్తున్నారు.
నిజానికి ఈ సినిమాను గతంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన దానిని క్యాన్సిల్ చేసి, రెండోసారి తెరకెక్కించడం జరిగింది. కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 8న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
