1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. after Kashmir schedule over Sivakarthikeyan buzz

కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి శివకార్తికేయన్ సందడి

Sivakarthikeyan buzz
Sivakarthikeyan buzz
స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది.  రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.
 
తాజాగా ఈ చిత్రం సంబధించి హ్యుజ్ కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. 75 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యుల్ లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నాయి.  
 
 SK21  శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. 'గట్స్ అండ్ గోర్’ దేశభక్తి  కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.  
 
ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్.  సినిమాటోగ్రాఫర్ గా సిహెచ్ సాయి, ఎడిటర్ గా ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్  గా స్టీఫన్ రిక్టర్ పని చేస్తున్నారు.    
About Writer
డీవీ
తర్వాతి కథనం
ఆదిత్య గంగసానిని ఘన్ను భాయ్‌ గా పరిచయం చేసిన అభిషేక్ నామా