సంబంధిత వార్తలు
- కోడలితో 62 యేళ్ల మామ రంకు బాగోతం... పెళ్లికి అడ్డొచ్చిన కొడుకుని చంపి ముక్కలు చేసిన తండ్రి
- తాగిన మత్తులో కన్న కూతురుపైనే గొడ్డలితో దాడి...
- మొదటి భార్య కుమార్తెను హత్య చేసిన రెండో భార్య
- 'గల్లీ బాయ్'కు సెన్సార్ దెబ్బ.. మరీ ఇన్ని కత్తెర్లా.. కారణమేంటి?
- చెర్రీ సరసన బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్ సరసన.. హాలీవుడ్ ముద్దుగుమ్మ
పెళ్లి మాట దాటేస్తోంది, కానీ కూతురి పేరు చెప్పేసిన ఆలియా...
బాలీవుడ్ క్యూటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ 2012లో "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమాతో సినీ ప్రవేశం చేసింది. అదే సినిమాలో హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రాతో లవ్ బ్రేకప్ అయ్యిన తర్వాత రణ్‌బీర్ కపూర్ నామస్మరణ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ప్రేమకథ రసవత్తరంగా సాగుతోంది. ఇక త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అభిమానులు సైతం వీరి పెళ్లి చూడటానికి ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.
పెళ్లి ఎప్పుడని ఎవరైనా అడిగితే తెలివిగా సమాధానాలు చెప్తూ తప్పించుకుంటోంది ఈ అమ్మడు. సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ మాట దాటేస్తున్న ఆలియా పిల్లల పేర్లు వరకు ఆలోచించేస్తోంది. ఆలియా నటించిన గల్లీ భాయ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ డ్యాన్స్ షోకు వచ్చింది ఆలియా. అందులో ఓ పార్టిసిపెంట్ మాట్లాడుతూ పొరపాటున ఆలియాను ఆల్సాగా సంభోదించింది. వెంటనే రియాక్ట్ అయిన ఆలియా ఈ పేరు తనకు చాలా నచ్చిందని, తన కూతురికి పెట్టుకుంటానని చెప్పింది.
