గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (20:26 IST)

కోడలితో 62 యేళ్ల మామ రంకు బాగోతం... పెళ్లికి అడ్డొచ్చిన కొడుకుని చంపి ముక్కలు చేసిన తండ్రి

కామంతో కళ్లుమూసుకుని పోయిన కొందరు కామాంధులు అతి కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు. వావివరుసలు మరిచిన కొందరు కామాంధులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమెను పెళ్ళి చేసుకోవాలని భావించాడో 62 యేళ్ళ మామ. ఈ విషయం తెలిసి దండించిన పాపానికి కుమారుడుని చంపి ముక్కలు చేసి వాటిని చెరువు నీళ్ళలో పడేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాబ్ రాష్ట్రలోని ఫరీద్‌కోట్‌కు సమీపంలో డబ్రీఖానా అనే ప్రాంతానికి చెందిన రజ్వీందర్ సింగ్ అనే వ్యక్తికి జస్వీర్ కౌర్ అనే యువతితో 12 యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కన్నబిడ్డలాంటి కోడలు జస్వీర్ కౌర్‌పై రజ్వీందర్ సింగ్ తండ్రి అయిన చోటా సింగ్ కన్నేశాడు. 
 
ఆ తర్వాత కోడలిని మెల్లగా ముగ్గులోకి దించిన మామ రజ్వీందర్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఏకంగా పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం తన కుమారుడుకి విడాకులు ఇవ్వాలని కోడలిపై ఒత్తిడి చేయసాగాడు. ఈ విషయం రజ్వీందర్‌ చెవినపడింది. దీంతో తండ్రిని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ తండ్రిలో ఎలాంటి మార్పురాలేదు. 
 
ఈ క్రమంలో తన భార్యతో కన్నతండ్రి శారీరకంగా కలిసివున్న దృశ్యాన్ని రజ్వీందర్ కళ్లారా చూశాడు. దీంతో తండ్రిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో మిన్నకుండిన చోటా సింగ్.. రాత్రి నిద్రపోతున్న సమయంలో రజ్వీందర్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.. రెండు సంచుల్లో మూటగట్టి చెరువు నీటిలో పడేసేందుకు ప్లాన్ చేశాడు.
 
ఈ ప్లాన్ ప్రకారం తొలి మూటను వేసిన తర్వాత రెండో మూటను తీసుకెళ్లే సమయంలో గ్రామస్థుల కంటపడింది. మూటకు రక్తం మరకలు అంటుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు చోటా సింగ్‌ను నిలదీశారు. అయితే, వారిని బుకాయించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ గ్రామస్థులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో గ్రామానికి వచ్చిన పోలీసులు చోటా సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించాడు. దీంతో ఆ కసాయి తండ్రిని హత్య చేశాడు.