గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:45 IST)

#Valentines స్పెషల్.. రాహుల్ గాంధీకి ముద్దుపెట్టిన ఆమె.. ఎవరు?

ప్రేమికుల రోజును పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా లవర్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కూడా ముద్దు గిప్ట్‌గా వచ్చింది. లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేసే దిశగా.. ప్రచార అస్త్రాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గుజరాత్ వల్సాద్ ప్రాంతంలో జరిగిన సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళా కాంగ్రెస్ నేతలు పూల దండలతో రాహుల్ గాంధీని సత్కరించారు. ఆ సమయంలో ఓ మహిళా కాంగ్రెస్ నేత.. రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దెట్టింది. ఈ సీన్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గాంధీ నగర్ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో వున్న వల్సాద్‌లో జరిగిన సభలో మహిళా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని సత్కరించడంతో పాటు పూలమాలలేసి బుగ్గల్ని గిచ్చి మరీ ఆనందించారు. 
 
రాహుల్ గాంధీని తమ బిడ్డలా భావించి ఆయనకు ముద్దెట్టడం, బుగ్గ గిల్లడం చేసారు. అయితే ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియా ప్రేమికుల రోజుకు లింక్ చేసి మీమ్స్ పేలుస్తున్నారు. ప్రేమకు ఈ సీన్ నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీకి ప్రేమికుల రోజున ముద్దు గిఫ్ట్‌గా వచ్చిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.