వివాహితకు అధిక వడ్డీకి డబ్బులు... కోర్కె తీర్చుతావా లేదా అంటూ వేధింపులు...

మోహన్ మొగరాల| Last Modified గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:38 IST)
మహిళా కానిస్టేబుల్ భర్త ఓ వివాహితపై అత్యాచార యత్నం చేసిన ఘటన విజయవాడలో జరిగింది. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి, మహిళా కానిస్టేబుల్ భర్త అయిన శ్రీనివాసరావు సింగ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాసరావు బాధితురాలి భర్తకు 50 వేల రూపాయలు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

ఆమె ఫోటోలు, వీడియోలను ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని చూపుతూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే క్రమంలో బాధితురాలిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపింది. విజయవాడ పోలీసులు శ్రీనివాసరావుపై ఐటి చట్టం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :