బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:57 IST)

సచినే అవుతావో.. సోంబేరి అవుతావో నీ ఇష్టం... ప్రేమికుల రోజు 'మజిలీ' టీజర్ టచ్(Video)

నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్‌లకు ప్రేక్షకుల నుండి అనుకూల స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కాగా ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ టీజర్‌ని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసింది.
 
నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తర్వాత శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజిలీ’. అయితే... ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రావు ర‌మేష్, పోసాని కృష్ణముర‌ళి, సుబ్బరాజులు ఈ చిత్రంలో పలు కీల‌క‌పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి... విష్ణువ‌ర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
"నీకో సంవత్సరం టైమిస్తున్నా ఈ లోగా నువ్వు సచినే అవుతావో.. సోంబేరి అవుతావో నీ ఇష్టం" అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతున్న ఈ టీజర్‌లో "నా ఫ్యామిలి జోలికి రావద్దు" అంటూ సమంత చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంది. చైతూ, సమంతల మధ్య ఫ్యామిలీ గొడవలను శివ చాలా ఆసక్తికరంగా మలచినట్టు తెలుస్తోంది. మొత్తంగా టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా చైతూకి మంచి బ్రేక్ ఇస్తోందనే అనిపిస్తోంది. చైతన్య క్రికెటర్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. వీడియో చూడండి...