సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (15:18 IST)

దివ్యాంష కౌశిక్‌ను హత్తుకున్న చైతూ.. మరి సమంత సంగతేంటి?

నాగచైతన్య, సమంత పెళ్లికి తర్వాత కలిసి నటించే ''మజిలీ'' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చైతూ క్రికెటర్‌గా కనిపిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనుంది. 
సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా, కథాకథనాలు, సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక బలంగా నిలుస్తాయని సినీ జనం అంటున్నారు.
 
ఈ పోస్టర్లో దివ్యాంష కౌశిక్ చైతూను హత్తుకునేలా వుంది. ఈ పోస్టర్‌ను బట్టి చైతూ రెండు అవతారాల్లో అదరగొట్టనున్నాడని తెలుస్తోంది. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత చైతూకు భార్యగా కనిపించనుంది.