వాలైంటెన్స్ డేపై నమ్మకం లేదు.. ఆ ఒక్క రోజు ప్రేమిస్తే సరిపోతుందా? రకుల్

Karti-Rakul
Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (10:30 IST)
ప్రేమికుల రోజుపై టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ చేసింది. వాలెంటైన్స్ డేపై తనకు ఎలాంటి నమ్మకాలు లేవని.. పాశ్చాత్య సంస్కృతిని భారతీయులు వేడుకగా చేసుకోవడంలో అర్థం లేదని చెప్పుకొచ్చింది. ప్రేమ అంటే ఒక రోజుకే పరిమితం కాదని.. ఆ రోజు మాత్రం సంతోషంగా వుండి, కానుకలు ఇచ్చుకుంటే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఆ ఒక్క రోజు ప్రేమించి, మిగతా సంవత్సరమంతా ప్రేమించకున్నా ఫర్వాలేదా? అని రకుల్ ప్రీత్ సింగ్ ఎదురుప్రశ్న వేసింది. కమర్షియల్ కోణంలో మాత్రమే ఇవి బాగుంటాయని చెప్పింది. షాపింగ్స్, గిఫ్ట్స్ అంటూ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడానికే ప్రేమికుల రోజు ఉందని చెప్పుకొచ్చింది. 
 
తన తాజా చిత్రం దేవ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. దేవ్ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా 14వ తేదీన విడుదల కానుందని... అదే రోజున తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో 'దేవ్' చిత్రాన్ని చూడబోతున్నానని స్పష్టం చేసింది. ప్రేమ అనేది ఎవరికైనా పంచవచ్చునని.. అందుకే తన తల్లిదండ్రులతో కలిసి దేవ్ సినిమాకు వెళ్తున్నానని చెప్పింది. ప్రతి రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటేనే.. జీవితం సంతోషంగా వుంటుందని రకుల్ వ్యాఖ్యానించింది. దీనిపై మరింత చదవండి :