నువు నీ పిచ్చితో ఉంటే... ప్రపంచమే సర్దుకుపోతుంది... పవన్ పైన బన్నీ కామెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చెప్పను బ్రదర్ వివాదం రావడం... ఆ తర్వాత వీరిద్దరి మధ్య బాగా గ్యాప్ రావడం తెలిసిందే. శ్రీరెడ్డి పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు అల్లు అరవింద్ & అల్లు అర్జున్ వెంటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చెప్పను బ్రదర్ వివాదం రావడం... ఆ తర్వాత వీరిద్దరి మధ్య బాగా గ్యాప్ రావడం తెలిసిందే. శ్రీరెడ్డి పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు అల్లు అరవింద్ & అల్లు అర్జున్ వెంటనే పవన్‌కు సపోర్ట్‌గా నిలవడంతో ఇద్దరి మధ్య ఆ గ్యాప్ తగ్గింది. ఆతర్వాత బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ సక్సెస్‌మీట్‌కు పవన్ ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది.
అయితే... తాజాగా బన్నీ పవన్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఏమని పోస్ట్ చేసాడంటే.. ‘నువు నీ పిచ్చితో ఉంటే... ప్రపంచమే సర్దుకుపోతుంది’ అంటూ పవన్ ఫోటోను షేర్ చేశారు. ఇంతమంది మెగా హీరోలు ఉన్నా కూడా ఒంటరిగానే నిలబడ్డారు పవన్.
ఏ ఒక్కరి సహాయాన్ని కోరడం లేదు. ఇటీవల రామ్ చరణ్... పవన్ పిలిస్తే ప్రచారం చేయడానికి రెడీ అని చెప్పిన విషయం తెలిసిందే. బన్నీ ఇలా పవన్ గురించి కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మేమంతా ఒక్కటే అంటూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట.