మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (09:41 IST)

పవన్ గారూ.. మాపై గంజాయి మచ్చ ఎలా వేస్తారు..?: యువత ప్రశ్న

మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది మాత్రమే గంజాయి కేసుల్లో నిందితులని.. అలాంటిది.. తమపై గంజాయి మచ్చ ఎలా వేస్తారని ఆ ప్రాంత యువకులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిం

మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది మాత్రమే గంజాయి కేసుల్లో నిందితులని.. అలాంటిది.. తమపై గంజాయి మచ్చ ఎలా వేస్తారని ఆ ప్రాంత యువకులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. మాడుగుల ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత గంజాయి రవాణాకు దిగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని యువత ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జనసేన అధినేత పర్యటించే ప్రాంతాల గురించి పార్టీ శ్రేణులు అవగాహనలోపంతో, తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పవన్ తెలుసుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మాడుగుల యువత అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఇదిలా ఉంటే.... రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకపోవడం జనసేన చేసిన పెద్ద తప్పిదమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా గురువారం ఆయన విశాఖ జిల్లా పాడేరు, మాడుగుల, నర్సీపట్నంలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తప్పేనన్నారు.
 
2014 ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం 5-10 సీట్లయినా జనసేన గెలుచుకునేది. తద్వారా అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని నిలదీసి ఉండేవాడిని. 2014లో అవినీతి పార్టీలను అడ్డుకోవడానికి కలిసి ప్రయాణం చేద్దామని చంద్రబాబు అంటే సరేనన్నాను. ఆయనను నమ్మి మోసపోయానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.