గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Preeti
Last Modified: బుధవారం, 6 జూన్ 2018 (16:20 IST)

పవన్ భార్య డెలివరీ సమయంలో అన్నీ సిద్ధంగా వుంచారట... కానీ భయంతో...

ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొంటున్న పవన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. సీఎం ఇంటి కింద తవ్వినా ఏదో ఒకటి బయటపడుతుందని, అలాగని ఆయన నివాసాన్ని కూడా కూల్చివేసి ఖనిజాలను బయటికి తీస్తారా అని ఛలోక్తి విసిరారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపితే ఊరుకోబోయ

ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొంటున్న పవన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. సీఎం ఇంటి కింద తవ్వినా ఏదో ఒకటి బయటపడుతుందని, అలాగని ఆయన నివాసాన్ని కూడా కూల్చివేసి ఖనిజాలను బయటికి తీస్తారా అని ఛలోక్తి విసిరారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపితే ఊరుకోబోయేది లేదని చెప్పారు. పవన్ అరకు రిసార్ట్‌లో గిరిజన యువతీయువకులతో ప్రత్యేకంగా సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీసారు. 
 
గిరిజన ప్రాంతాల్లో మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని అభిప్రాయపడ్డారు. డెలివరీ సమయంలో నగరవాసులే కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ల కష్టాలు వర్ణనాతీతం అని బాధపడ్డారు. ఈ సమయంలో ఆయన తన భార్య అన్నా డెలివరీ టైమ్‌లో ఎదుర్కొన్న కష్టాలను వాళ్లకు చెప్పుకున్నారు. 
 
‘అన్నాకు డెలివరీ డేట్ దగ్గరపడుతుండటంతో సహాయంగా ఓ డ్రైవర్‌ను, ఐదుగురు పనివాళ్లను ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా నియమించాను. తీరా ప్రసవం సమయంలో నొప్పులు మొదలయ్యాక టైమ్ బ్యాడో ఏమో డ్రైవర్ సహా ఎవరూ అందుబాటులో లేరు. దాంతో నేనే స్వయంగా 5 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ సమయంలో ఎంతో భయం వేసింది. ఆ సమయంలో నేనూ నా భార్య తప్ప మరో మనిషి లేరు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కలచివేసింది. 
 
సిటీలో ఉండే నా పరిస్థితే ఇలా ఉంటే... మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది. గిరిజనులు డోలీ కట్టుకుని వైద్య సదుపాయాల కోసం 60, 70 కిలోమీటర్ల దూరంలోని హాస్పిటల్‌లకు వెళ్తున్నారు. కనుక అలాంటి వాళ్లకు మరింత మెరుగైన వైద్యసదుపాయాలు అందించాలనేదే నా ఆలోచన’ అంటూ పవన్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.