శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (16:13 IST)

నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన పవన్ : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త రాజకీయ ఒరవడికి పవన్ శ్రీకారం చుట్టారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ చేసే ప్రసంగాలు సహ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త రాజకీయ ఒరవడికి పవన్ శ్రీకారం చుట్టారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ చేసే ప్రసంగాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయని, ప్రజలను అక్కున చేర్చుకునే విధంగా ఉన్నాయన్నారు. 
 
ఆయన గురువారం మాట్లాడుతూ, ప్రజలతో పవన్ మమేకమవడం, సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి చూస్తుంటే ఒక ఉద్యమ నాయకుడిలా కష్టపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించాలనే దాని కంటే.. ప్రజాసేవ అనే గొప్ప కార్యక్రమంతో పవన్ ముందుకొచ్చారు... 'నేను ముఖ్యమంత్రిని కావాలని రాజకీయాల్లోకి రాలేదు' అనే పవన్ నినాదం ప్రజలకు నచ్చవచ్చు. రాబోయే రోజుల్లో ఒక ప్రభంజనానికి పవన్ కారణమవుతారని జగదీశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో గతంలో పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి లేదని తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయన గురించి నిష్పక్షపాతంగా చెబుతున్నా.. పవన్‌కు చిత్తశుద్ధి ఉంది అని అన్నారు. 'పవన్‌కు చిత్తశుద్ధి కలగడానికి ఒక బలమైన కారణం సీఎం కేసీఆరే. ఇటీవల కేసీఆర్‌ని పవన్ కలిసినప్పుడు.. పవన్‌లో ఉద్యమస్ఫూర్తిని కేసీఆర్ నింపారని జగదీశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు.