సంబంధిత వార్తలు
- ఇటలీ వెళ్లనున్న మెగా ఫామిలీ - నవంబరి 5 న హైదరాబాద్ లో వరుణ్ తేజ్, లావణ్య వివాహ ఫంక్షన్
- కనక దుర్గ అమ్మ వారే నన్ను రప్పించారు : శ్రీలీల
- అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరేనాతో పండగలు సంబరం చేయడానికి సిద్ధమైన హైదరాబాద్
- అడాప్టివ్ రేడియోథెరపీతో 88 ఏళ్ల వ్యక్తిని రక్షించిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్
- లేడీస్ హాస్టల్లో మహిళ మృతి .. ఎందుకో తెలుసా?
కేటీఆర్ డైనమిక్ లీడర్.. హైదరాబాదులో వున్నామా.. అమెరికాలో వున్నామా?
సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ అని... హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోవడానికి కేటీఆర్ కృషి కారణమని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన అందరినీ కలుపుకుపోతారని కితాబునిచ్చారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. పదేళ్ల కాలంలో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయని అనిల్ రావిపూడి అన్నారు. నగరానికి కొత్తగా వచ్చిన వారు తాము హైదరాబాద్‌లో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారని అనిల్ రావిపూడి కొనియాడారు.
'భగవంత్ కేసరి' సినిమా కోసం ఫ్లైకామ్ షాట్స్ తీసినప్పుడు హైదరాబాద్ అందాలు చూసి అబ్బురపడ్డానని తెలిపారు.
