సంబంధిత వార్తలు
- జగన్ అక్రమాస్తుల కేసు : సీబీఐ అఫిడవిట్లలో పస లేదంటూ... సుప్రీంకోర్టు అసహనం..
- రోజూ అసెంబ్లీకి రండి.. జగన్ భుజంపై చెయ్యేసి చెప్పిన ఆర్ఆర్ఆర్!
- ఆ అధికారులపై కేసు నమోదైంది.. వారిని సస్పెండ్ చేయాలి : ఉండి ఎమ్మెల్యే
- జగన్‌పై రఘురామ కృష్ణ రాజు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? మూడేళ్ల కిందట ఏం జరిగింది?
- మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్
డెలివరీ బాయ్ చేతుల మీదుగా విడుదల చేసిన దేవ్ పారు చిత్రం పోస్టర్
Dev paru poster
అందరి ఆకలి తీర్చడానికి డెలివరీ బాయ్స్ ఎంతో కష్టపడుతూ.. ఎండ, వాన అని తేడా లేకుండా సమయానికి ఫుడ్ అందిస్తున్నారని వారి శ్రమకు దేవ్ పారు టీమ్ ఒక చిన్న ట్రిబ్యూట్‌ను ప్లాన్ చేశారు. అందుకని ఒక డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసీ, ఆహారం తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌తో పోస్టర్ లాంచ్ చేశారు. వీరి ఐడియాకు నెటిజనులు ఫిదా అయిపోతున్నారు. పోస్టర్ లాంచ్‌ను వినుత్నంగా ఆవిష్కరించడమే కాకుండా ఇలాంటి సామాజిక బాధ్యతను అందరికి గుర్తుచేశారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు ముచ్చటించుకుంటున్నారు.
సామాన్యుడిని సెలబ్రేటీ చేసిన దేవ్ పారు టీమ్ పోస్టర్ లాంచ్‌లోనే ఇలాంటి ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారంటే ఇంకా ప్రమోషన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో, సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులను ఆసక్తి నెలకొంది. కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు, త్వరలోనే మరో సాలిడ్ అప్డేట్‌తో వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
