అనిల్ రావిపూడికి నిర్మాత నాగవంశీ కి మధ్య విభేధాలు !
Anil Ravipudi, Nagavamsi
సోషల్ మీడియాలో నాపై వస్తున్న విమర్శలు పట్టించుకోను. తెల్లారిలేచాక కొంత మందికి ఇదే పని. మోదీని కూడా కామెంట్ చేస్తారు. అందుకే పెద్దగా పట్టించుకోకూడదు అన్నారు. అలాగే నిర్మాత నాగవంశీతో విభేదాలున్నాయని టాక్ వుంది అన్న దానికి సమాధానమిస్తూ, సితార ఎంట్ టైన్ మెంట్ సంస్థ నిర్మాత నాగవంశీకి నాకు విభేదాలు లేవు. సహజంగా బయట కొందరు అనుకుంటుంటారు. ప్రతి శుక్రవారంనాడు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా గురించి టెక్నీషియన్స్ గురించి చర్చించుకుంటాం. దానికి ఎవరూ అతీతులు కాదు.
కానీ నాగవంశీతో సరిలేరు నీకెవ్వరూ సినిమా టైంలో ఏవో అపార్థాలున్నాయంటూ కొందరు అనుకున్నారు. నేను ఐదేళ్ళ నాడు సినిమా చేయాలి. కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఆయన బిజీ, నేను బిజీ. టైం కుదిరితే సితార బేనర్ లో సినిమా చేస్తానంటూ అనిల్ రావిపూడి తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదల సందర్భంగా వీడియో ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

