కర్ణ నుంచి విక్రమ్ ఎందుకు బయటకి వచ్చాడో తెలుసా!
ChiyanVikram twitter photo
మహాభారంతో సూర్య వరప్రసాదమైన కర్ణుని పాత్ర కోసం ఫొటోషూట్ కూడా చేశాడు. కొంత భాగం టెస్ట్ షూట్ జరిగింది. భారీ బడ్జెట్‌తో తీయబోయే ఈ సినిమాను జాకీ భగ్నాని, పూజా ఎంటర్టైన్మెంట్ సంయుక్తగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 3డిలో వుండేలా ప్లాన్ చేశారు. అయితే షడెన్‌గా ఈ సినిమాను తప్పుకుంటున్నట్లు విక్రమ్ నిర్వహించే సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి వుంది. ఇందుకు విక్రమ్‌కు జరిగిన అవమానమే కారణంగా పేర్కొంటున్నారు కొందరు. వయస్సురీత్యా బాడీని మార్చుకుంటూ వస్తున్న విక్రమ్‌కు ఇది గుదిబండగా మారింది. నిర్మాణసంస్థలలో కొన్ని లోపాలు కూడా వున్నాయని చెబుతున్నారు. ఇదిలా వుండగా, అప్పట్లోనే మోహన్‌లాల్, మమ్ముట్టి వంటివారు పౌరాణిక సినిమాను పాన్ ఇండియా లెవల్లో తీస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ అజయ్‌దేవగన్ కూడా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఏదిఏమైనా కర్ణుని జీవితంలో వున్న అడ్డంకులు సినిమాకు కూడా వున్నాయంటూ సెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

