ERROR 500 ట్రైలర్ బ్రిలియంట్ గా వుంది : వి. ఎన్ ఆదిత్య
ERROR 500 team with V. N Aditya
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వి. ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఏమిటని సాందీప్ గారిని అడిగాను. సంతోషం సురేష్ గారు చూసారని చెప్పారు. మరో ఆలోచన లేకుండా మీ సినిమా చాలా సేఫ్ హాండ్స్ లో వుందని చెప్పాను. సురేష్ గారు వండర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్. ఆయన జడ్జ్ మెంట్ బావుంటుంది. 'ERROR500' జెస్సికి యాప్ట్ టైటిల్. ఒకేసారి మల్టిపుల్ పనులు చేయగలడు. నేను రెగ్యులర్ గా బిగ్ బాస్ షో చూస్తాను. అందులో నాకు నచ్చినవారంతా ఈ వేడుక లో వుండటం ఆనందంగా వుంది. ఈ స్టేజ్ పైకి వస్తుంటే సడన్ గా ఆదిత్య 369 గుర్తుకు వస్తోంది. కాలానికి వెనక్కి వెళ్లి బిగ్ బాస్ సీజన్ 5, ముందుకు వెళ్లి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ని చూస్తున్నట్లు అనిపించింది. 'ERROR500' ట్రైలర్ బ్రిలియంట్ గా వుంది. జెస్సి, సాందీప్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.
జెస్సీ మాట్లాడుతూ..'ERROR500' కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. మా నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. వారి నమ్మకాన్ని నిర్మబెట్టుకుంటాం. దర్శకుడు సాందీప్ యూనిక్ కథతో రూపొందించారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫణి కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు.
దర్శకుడు సాందీప్ మాట్లాడుతూ.. జెస్సికి సినిమాలంటే చాలా ప్యాషన్. చాలా అంకిత భావంతో ఈ సినిమా చేశాడు. ట్రైలర్ లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా వుంటుంది. ఫణి కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సురేష్, విఎన్ ఆదిత్య, ఆకాష్ పూరి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరునా థాంక్స్' తెలిపారు.
తర్వాతి కథనం
