రోబో 2: విజయదశమి కానుకగా రోబో, అమీజాక్సన్ పూజా ఫోటో...
రోబో 2 సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాల్లో టాక్. రోబో2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. క్లయిమాక్స్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సన్నివేశాల్ల
రోబో 2 సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాల్లో టాక్. రోబో2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. క్లయిమాక్స్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సన్నివేశాల్లో రజనీకాంత్ కనబర్చిన ఎనర్జీ సూపర్ అంటున్నారు సిల్వ. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, చిత్ర కథానాయకుడు రజనీకాంత్, కథానాయిక అమీ జాక్సన్‌పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం.
నవంబర్‌లో ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రజనీ ఎలా కనిపిస్తారు? అనే ఊహకు తెరదించుతూ ఈలోపే చిత్రదర్శకుడు శంకర్ శాంపిల్‌గా ఓ వర్కింగ్ స్టిల్ బయటపెట్టారు. దీపావళి సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబర్ 19న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయదశమి సందర్భంగా రోబో2 ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అమీజాక్సన్, రజనీకాంత్ జంట నిల్చుని.. వారి మెడలో మాలలు ధరించినట్లు గల ఈ స్టిల్‌కు భారీ క్రేజ్ లభించింది. గతంలో రోబో ఫస్ట్ పార్ట్ రిలీజైన సందర్భంలో రోబోగా రజనీకాంత్ ఆయుధాలను పూజ చేస్తున్నట్లు వచ్చిన ఫోటోకు అప్పట్లో భారీ క్రేజ్ లభించింది. ప్రస్తుతం రోబో-2 రిలీజ్ కాకముందే భారీ పబ్లిసిటీ సంపాదించుకుంది. ఫోటోను మీరూ చూడండి.
