ఆనందంగా అమెరికా వెళుతున్నా- విజయ్ దేవరకొండ
Devarakonda brothers
పుష్పక విమానం సినిమా ఈరోజే అంటే శుక్రవారం అన్నిచోట్ల విడుదలవుతుంది. ఈరోజు విడుదల తర్వాత రెస్పాన్స్ చూడాలని ఆయన అనుకున్నారు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న `లైగర్` సినిమా షూట్ కోసం ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు. ఈరోజు తెల్లవారిజామున ఆయన అమెరికా పయనం అయ్యారు. పూరీ, చార్మితోపాటు కొద్దిమంది టీమ్ అమెరికా వెళుతున్నారు.
Pushpaka Vimanam heroiens family
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, అన్న ఇంతవరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేస్తున్న లైగర్ సినిమా అంతకుమించి వుంటుంది. పూర్తి యాక్షన్ వినోదం కూడా ఇందులో వుంటాయి. మైక్ టైసన్ వంటి లెజెండ్ ఇందులో కనిపించడం నిజంగా మా అన్న చేసుకున్న అదృష్టం అని తెలిపారు.
డబ్బులు బాగా రావాలి- పూరీ
పుష్పక విమానం విడుదవుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. నిర్మాత గోవర్దన్ గారికి డబ్బులు బాగా రావాలి. రిలీజ్‌నాడు విజయ్ దేవరకొండ వుండాలి కానీ నేను .అమెరికా తీసుకెళ్లిపోతున్నాను.. నేను అక్కడ వున్నా బ్లాక్‌బస్టర్ అనే పేరు వినాలనుంది. అని చెప్పారు.
