గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 నవంబరు 2021 (13:40 IST)

మైక్ టైసన్ పోస్టర్ విడుదల

mike tyson
కరోనా భయాల నుంచి నెమ్మదిగా బయటపడుతున్న చిత్ర పరిశ్రమలో ఈ దీపావళి సరికొత్త వెలుగులు పంచుతోంది. థియేటర్‌లో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ దీపాల పండగకు ‘పెద్దన్న’, ‘ఎనిమి’, ‘మంచి రోజులు వచ్చాయి’ తదితర చిత్రాలు సందడి చేస్తుండగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెబుతూ, సరికొత్త పోస్టర్లు, టీజర్లు, సాంగ్‌ ప్రోమోలు, లిరికల్‌ వీడియోలు విడుదల చేశాయి.
 
రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ‘ఖిలాడి’ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.
 
బాక్సింగ్‌ కింగ్‌ మైక్‌ టైసన్‌ భారతీయ వెండితెరపై సందడి చేసే సమయం ఆసన్నమైంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ(vijay devarakonda) నటిస్తున్న మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం ‘లైగర్‌’. దీపావళి సందర్భంగా మైక్‌ టైసన్‌ పిడికిలి బిగించిన పోస్టర్‌ను విడుదల చేశారు.