1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hema caught red handed once again

క్వాక్ ఏరీనా పబ్ పార్టీలో నటి హేమ... డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని వివరణ

hema
నటి హేమ మళ్లీ ఈగల్ టీమ్ కన్నుకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్వాక్ ఏరీనా హబ్‌పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 
 
పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఇక్కడ వున్న సుమారు 64మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్ తేలింది. 
 
వీరిలో ఆరుగురు గంజాయి సేవించినట్లుగా, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
అయితే క్వాక్ ఏరీనా పబ్ పార్టీలో హేమ కూడా పాల్గొన్నారు. అయితే దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ఓ వీడియోను సైతం పోస్టు చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, అనవసరంగా తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆ వీడియోలో కోరారు. 
తర్వాతి కథనం
Karmeni Selvam Review: సముంద్రఖని నటించిన కార్మేని సెల్వం ఎలా వుందంటే... కార్మేని సెల్వం రివ్యూ