సంబంధిత వార్తలు
- ప్రియుడితో మాల్దీవుల్లో మజా చేస్తున్న సొట్టబుగ్గల సుందరి!
- రాధే శ్యామ్.. పూజాతో పాటు కునాల్‌కు బర్త్ డే.. ప్రేరణ ఫస్ట్ లుక్ విడుదల
- కరోన లాక్డౌన్ జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పింది : శృతిహాసన్
- మోనాల్ గజ్జర్ది V షేప్, అటో కాలు ఇటో కాలు వేస్తుంది, ఎటు వెళ్తుందో: సుజాత సంచలనం
- నువ్వు-నేను నటి ప్రెగ్నెంట్, వీడియో పోస్ట్ చేసింది
సునామీ సుధాకర్ హైలైట్.. బతుకుమ్మ పాటకు జబర్దస్త్ టీమ్ సూపర్ డ్యాన్స్ (video)
Jabardasth team
ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ కూడా అంతా కలిసి ఓ పాటను చేసారు. అది యూ ట్యూబ్‌లో బాగానే వైరల్ అవుతుంది. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసుకునే సాయిలేఖ, వినోద్, శాంతి స్వరూప్ సహా మరో ముగ్గురు నలుగురు అదే గెటప్స్‌లో బతుకమ్మ పాటలో కనిపించారు.. కనువిందు చేసారు.
ఈ పాటలో సునామీ సుధాకర్ హైలైట్ అయ్యాడు. ఆయనపైనే పాట అంతా షూట్ చేసారు. డాన్సులు చేయడం.. పాట పాడటం అంతా సుధాకర్ చూసుకున్నాడు. ఇక కుండలు పట్టుకుని రావడం.. బతుకమ్మకు పూలు అల్లడం.. చిందేయడం లాంటివి అన్నీ మిగిలిన లేడీ గెటప్స్‌లో ఉన్న వాళ్లు చూసుకున్నారు.
నిండు ముత్తైదువుల్లా ఈ పాటను వాళ్లు పూర్తి చేసారు. మధ్యలో పల్లె అందాలు.. పడుచుల సొగసులు.. తంగిడిపూల బతుకమ్మలు ఇవన్నీ బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఎన్ని పాటలు వచ్చినా కూడా జబర్దస్త్ బతుకమ్మ పాట అంటూ ఇది మాత్రం బాగానే వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రోమోతో బాగానే ఆకట్టుకున్న వీళ్లు.. రేపు పూర్తి పాట వచ్చిన తర్వాత మరింత మాయ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
తర్వాతి కథనం
