శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:32 IST)

ప్రియుడితో మాల్దీవుల్లో మజా చేస్తున్న సొట్టబుగ్గల సుందరి!

తెలుగు చిత్ర పరిశ్రమలో సొట్టలబుగ్గల సుందరిగా పేరుపొందిన హీరోయిన్ తాప్పీ పన్ను. ఈ ఢిల్లీ సుందరికి తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడ వరుస ఆఫర్లు వస్తుండటమే కాదు ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు అక్కడే సెటిలైపోయింది. ఈ క్రమంలో మతియాస్ బోయే అనే వ్యక్తితో ప్రేమలో మునిగితేలుతోంది. తాజాగా తన ప్రియుడితో కలిసి మాల్దీవులకు వెళ్లిన తాప్సీ.. అక్కడు ప్రియుడితో కలిసి మజా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలోను తన ఇన్‍స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
నిజానికి కరోనా లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్క సెలెబ్రిటీ తమ ఇళ్ళకే పరిమితమయ్యారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఇపుడిపుడే బయటకు వస్తున్నారు. అలాగే, సినిమా షూటింగులు కూడా తిరిగి మొదలయ్యాయి. అయితే కొందరు సెలెబ్రిటీలు షూటింగ్స్‌లో పాల్గొంటుండ‌గా, మ‌రి కొంద‌రు టూర్స్‌కు వెళుతున్నారు. 
 
ఢిల్లీ బ్యూటీ తాప్సీ.. విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టిస్తోన్న త‌మిళ చిత్రం షూటింగ్ కోసం ఇటీవ‌లే జైపూర్ వెళ్లింది. ఆ సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే అక్కడి నుండి మాల్దీవుల‌కు చెక్కేసింది. 
 
మాల్దీవుల‌లో త‌న సోద‌రి శ‌గున్, ఈవానియాల‌తో పాటు బాయ్ ఫ్రెండ్ మ‌తియాస్ బోయేతో తాప్సీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. త‌మ గ్యాంగ్‌తో ఈ అమ్మ‌డు చేసే సంద‌డికి సంబంధించిన ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్స్‌కు కావల‌సినంత వినోదాన్ని అందిస్తుంది. 
 
తాజాగా ఈ పింక్ బ్యూటీ బిగ్గిని షూట్ వీడియో చేసి దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తాప్సీ వీడియోకి వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ‌, భూమి ప‌డ్నేక‌ర్ ఫ‌న్నీ కామెంట్స్ పెట్టారు. 
 
ఇక తాప్సీ సినిమాల విష‌యానికి వ‌స్తే భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు ర‌ష్మీ రాకెట్‌, లూప్ ల‌పేటా అనే చిత్రాల్లో కూడా నటించనుంది.