Mahakali update,: మహాకాళి అప్ డేట్ : ఆకట్టుకునేలా మహాకాళి గ్లింప్స్ - జనవరి 8న సిద్ధం
Sriya Reddy, Akshya Khanna
ఈ చిత్రం IMAX మరియు డాల్బీ ఫార్మాట్లలో బహుళ భాషలలో విడుదలవుతోంది. హైదరాబా, ముంబైలలో జరిగిన తొలి ప్రదర్శనలు, మంత్రముగ్ధులను చేసిందని ప్రశంసించిన తరణ్ ఆదర్శ్ వంటి విమర్శకులను ఆకట్టుకున్నాయి. పోస్టర్లు అద్భుతమైన అగ్నిమయ దృశ్యాలను మరియు నాటకీయమైన కథానాయికను సూచిస్తున్నాయి. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించారు. ఈ చిత్రం ఆడియన్స్ షేక్ చేస్తుందని కితాబిచ్చారు.
మీరు ఇంతకు ముందు విన్న దానిలా కాకుండా ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ప్రశాంత్ వర్మ తెలియజేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రానున్నామనీ జనవరి 8న సిద్ధమవుతున్నామని ప్రకటించారు.
ప్రశాంత్ వర్మ కథను అందించిన ఈ చిత్రానికి పూజాకొల్లూరు దర్శకత్వం వహించారు. రజత్కపూర్ మురళీశర్మ నాసర్ పృధ్వీరాజ్ తారాగణంగా కాగా, కెమెరా : సురేశ్రఘు, శ్రీనాగేంద్ర కళా దర్శకత్వం వహిస్తున్నారు. రివాజ్ దుగ్గల్ RKDS స్టూడియోస్ నిర్మిస్తోంది.

