1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Janga motion poster featuring Trigun released.

Trigun : జంగా గా త్రిగుణ్ మోషన్ పోస్టర్ విడుదల

Janga as Trigun
Janga as Trigun
త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం జంగా.  కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం.  నేడు త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ అప్డేట్‌ను ఇచ్చారు.
 
 
‘జంగా’ నుంచి పోస్టర్ & మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్, సౌండింగ్, హీరో లుక్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపిస్తున్నారు. కెరీర్‌లోనే డిఫరెంట్ సబ్జెక్ట్, పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని ఆకట్టుకోనున్నారు.
 
ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు.  ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇంకా ఈ సినిమాలో  శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి నటిస్తున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Thaman: ప్రజలు హ్యాపీగా వుండేందుకే ఓజీ టూర్ చేస్తున్నాం : థమన్