శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (09:46 IST)

మీరిచ్చే రెమ్యునరేషన్‌కు అంతా చూపించమంటే ఎలా... ఎవరు..?

నయనతార. మొదట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్లిమ్‌గా మారింది. మగవారు సిక్స్ ప్యాక్ కోసం ఎంత పాకులాడతారో, ఆడవారు జీరో సైజ్ కోసం అదేవిధంగా ప్రయత్నిస్తుంటారు.

నయనతార. మొదట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్లిమ్‌గా మారింది. మగవారు సిక్స్ ప్యాక్ కోసం ఎంత పాకులాడతారో, ఆడవారు జీరో సైజ్ కోసం అదేవిధంగా ప్రయత్నిస్తుంటారు. అయితే నయనతార జీరో సైజ్‌కు వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఆ జీరో సైజ్ నయనతారకు ఏ మాత్రం సూటవ్వలేదు. ఆమె అందాన్ని తగ్గించే విధంగా ఉండడంతో మళ్ళీ కాస్త లావైంది. మొదట్లో ముద్దుల సీన్లు, హీరోలతో కలిసి దగ్గరగా మెలిగే సీన్లు నయనతార బాగానే చేసింది.
 
అయితే కొంతమంది హీరోలతో నయనతార అప్పట్లో ప్రేమాయణం నడిచి అది కాస్త బెడిసి కొట్టి సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు తాజాగా మరో తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగివున్నట్టు టాక్. అయితే ప్రియుడు ఇప్పటికే నయనతారకు కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది. నువ్వు నటించే సినిమాల్లో హీరోలకు దగ్గరవ్వడం, ముద్దుల సీన్లు ఇలాంటివి చేయకూడదని షరతులు పెట్టాడట. దీంతో నయనతార కూడా తనను సంప్రదించే దర్శకులు, నిర్మాతలకు, ప్రస్తుతం షూటింగ్‌లో సినిమా దర్శకులకు కొన్ని షరతులు పెట్టేసిందట. హీరోలకు దగ్గరగా వెళ్ళే సీన్లు చేయను, ముద్దుల సీన్లు అసలు ఉండకూడదు.. కురచ దుస్తులు వేసుకోను. ఇలా ఒకటేమిటి.. ఎన్నో షరతులు పెట్టిందట.
 
ఉన్నట్లుండి నయనతార ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని కొంతమంది దర్శకులు ఆమెనే అడిగారట. మీరిచ్చే రెమ్యునరేషన్‌కు ఇంత కష్టపడాలా అంటూ తిరిగి దర్శకులకే ప్రశ్నలు వేస్తోందట నయనతారు. ఆ తర్వాత దర్శకులు విషయం తెలుసుకుంటే అసలు కథ తెలిసిందట. అందుకే దర్శకులు కూడా నయనతార షరతులకు ఒకే అంటున్నారట. ఇలా షరతులతో కూడిన సినిమాలు చేయడానికి అందరూ దర్శకులు ఒప్పుకోరు.. ఇక నయనతారకు సినిమా అవకాశాలు తగ్గిపోతాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.