శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (08:57 IST)

ఏ హీరోలకు లేనిది ప్రభాస్‌కు మాత్రమే ఉంది : నమిత

బొద్దుగుమ్మ నమిత అంటే తెలియని వారుండరు. అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో రాణిస్తూ పేరు బాగానే సంపాదించుకుంది. అయితే వీరేంద్ర చౌదరితో వివాహం తర్వాత సినిమాల వైపు వెళ్ళడం తగ్గిస్తోంది నమిత.

బొద్దుగుమ్మ నమిత అంటే తెలియని వారుండరు. అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో రాణిస్తూ పేరు బాగానే సంపాదించుకుంది. అయితే వీరేంద్ర చౌదరితో వివాహం తర్వాత సినిమాల వైపు వెళ్ళడం తగ్గిస్తోంది నమిత. సినిమాల్లో నటించే అవకాశాలున్నా ఇప్పుడే వివాహమైంది కాబట్టి కొన్నిరోజులు సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతోంది. తన భర్త వీరేంద్ర చాలా మంచివ్యక్తిని, నేనంటే ఆయనకు ప్రాణమని చెబుతోంది. 
 
భర్తగా నన్ను ఎప్పుడూ వీరేంద్ర చౌదరి కట్టడి చేయలేదు. స్నేహితుడిగానే ఎప్పుడూ మెలుగుతుంటారు. అది చెయ్యాలి.. ఇది చెయ్యకూడదని ఎప్పుడూ ఆంక్షలు కూడా విధించలేదు అని చెప్పింది నమిత. అయితే తనకు ఇప్పటికీ బాగా నచ్చిన హీరో ప్రభాస్ ఒక్కరేనని, ఆయనతో కలిసి గతంలో సినిమాల్లో కూడా నటించానని చెప్పింది. 
 
ఇప్పుడున్న హీరోల్లోనే ఒక్క ప్రభాస్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి మిగిలిన హీరోయిన్లలో అది నాకు కనిపించడం లేదు. ప్రభాస్‌లో ఒక ప్రత్యేకత ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరిని కించపరిచే ఉద్దేశం నాది కాదని వివరణ ఇచ్చింది కూడా.