ఆర్.ఆర్.ఆర్. నుంచి ఒలివియా మోరిస్ లుక్ విడుదల
R.R.R., Olivia Morris
ఒలివియా 1997లో కింగ్‌స్టన్-అపాన్-థేమ్స్‌లో జనవరి 29న జన్మించింది. ఒలివియా 2014లో నేషనల్ యూత్ థియేటర్‌లో శిక్షణ పొందింది. రాయల్ వెల్ష్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా (2015-2018)లో నటనలో BA ఆనర్స్ పూర్తి చేసింది. బ్రిటిష్ హాలీవుడ్ నటి. ది టర్టిల్స్ షార్ట్ సినిమాలో నటించింది. హోటల్ పోర్టోఫినో (TV సిరీస్) వంటి చిత్రాలలో ఆమె తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా ఆర్.ఆర్.ఆర్.లో ఆమె రాణిగా నటించింది. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. టీమ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
