సంబంధిత వార్తలు
- 'బాహుబలి' రికార్డు బద్దలు... బాబాయ్ 'అజ్ఞాతవాసి' కోసం సంక్రాంతి వరకూ ఆగలేను...
- అబ్బో పవన్ కళ్యాణ్... ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్... ఖుష్భూ
- పవన్‌కు సారీ చెపితే రోజా కాళ్లుపట్టుకుని క్షమాపణ కోరతా : బండ్ల గణేష్
- పవన్ కల్యాణ్ పిలిస్తేనే.. జనసేన పార్టీలోకి వెళ్తా: సప్తగిరి
- వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఓ రౌడీ.. కిరణ్ రాయల్
పవర్ స్టార్ అజ్ఞాతవాసి స్టిల్స్ అదుర్స్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఇ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన స్టిల్స్‌ను ఆ చిత్రం బృందం సినీ యూనిట్ వెల్లడించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్‌తో సాగర తీరాన, మరో హీరోయిన్‌తో రెస్టారెంట్లో కూర్చుని వుండే పవన్ స్టిల్స్ అదిరిపోతున్నాయి. హైదరాబాద్‌లోని హెటెక్స్‌లో ఈ ఆడియో వేదిక మంగళవారం జరుగనుంది. ఇప్పటికే అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన రెండు పాటలు సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్న తరుణంలో మంగళవారం విడుదలయ్యే ఆడియోకు భారీ రెస్పాన్స్ వచ్చే ఛాన్సుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే.. వీడి చర్యలు ఊహాతీతం అంటూ డిసెంబర్ 16 విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి టీజర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆడియో 19న (నేడు) విడుదల కానుండగా.. ఈ నెల 29న సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుందని తెలిసింది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
