మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (12:40 IST)

పవన్ కల్యాణ్ పిలిస్తేనే.. జనసేన పార్టీలోకి వెళ్తా: సప్తగిరి

''సప్తగిరి ఎల్ఎల్‌బీ'' సినిమా హిట్టైన నేపథ్యంలో కమెడియన్ సప్తగిరికి సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పవన్‌కు వీరాభిమాని అయిన సప్తగిరి నటించిన ''సప్తగిరి ఎల్ఎల్‌బీ'' ఆడియో కార్యక్రమానికి జనసేనాని

''సప్తగిరి ఎల్ఎల్‌బీ'' సినిమా హిట్టైన నేపథ్యంలో కమెడియన్ సప్తగిరికి సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పవన్‌కు వీరాభిమాని అయిన సప్తగిరి నటించిన ''సప్తగిరి ఎల్ఎల్‌బీ'' ఆడియో కార్యక్రమానికి జనసేనాని కూడా వచ్చారు. 
 
పవన్ కల్యాణ్ తన గుండెల్లో ఉంటాడని.. హీరోగా తన తొలి సినిమా అయిన "సప్తగిరి ఎక్స్ ప్రెస్" ఆడియో ఫంక్షన్‌కు విచ్చేసి ఆశీర్వదించారని.. ఆయనను జీవితాంతం గుర్తించుకుంటానని తెలిపాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే జనసేన పార్టీలోకి వందశాతం సిద్ధమని స్పష్టం చేశాడు. అయితే జనసేన పార్టీకి తాను అవసరమని పవన్ భావించి పిలుపునిస్తేనే ఆ పార్టీలోకి వెళ్తానని క్వారిటీ ఇచ్చాడు. 
 
"సప్తగిరి ఎల్ఎల్‌బీ" విజయవంతమైన నేపథ్యంలో సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా సప్తగిరి మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నాడు. పవన్ కోరితే జనసేనలోకి వెళ్తానని చెప్పాడు.