గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2017 (19:22 IST)

అబ్బో పవన్ కళ్యాణ్‌... ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్... ఖుష్భూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన నటన ఒక అద్భుతం. ఎప్పుడూ సింపుల్‌గా తన పని తాను చేసుకునే వ్యక్తి. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్‌ నటన అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాకు ఒక పాత్ర లభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన నటన ఒక అద్భుతం. ఎప్పుడూ సింపుల్‌గా తన పని తాను చేసుకునే వ్యక్తి. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్‌ నటన అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాకు ఒక పాత్ర లభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసే క్యారెక్టర్ నాకు మంచి మైలేజ్ ఇస్తుందన్న నమ్మకం నాకుంది. థ్యాంక్స్ త్రివిక్రమ్ అంటూ ఖుష్భూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
 
ట్విట్టర్ వేదికగా ఖుష్భూ పంపిన మెసేజ్‌లు ఇప్పుడు వేలాదిమంది చూస్తున్నారు. ఇప్పటివరకు ఖుష్భూ అజ్ఞాతవాసి సినిమాలో ఉన్నట్లు ఎవరికీ తెలియదు. మొదటిసారి ఆమె ఆ సినిమాలో నటిస్తున్నట్లు ఒక ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో ఖుష్భూ కోపంగా ముందు కూర్చుని ఉండగా వెనుక పవన్ కళ్యాణ్‌ కూడా సీరియస్‌గా చూస్తున్నట్లు ఉంది. ఇప్పటికే అజ్ఞాత వాసి సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.