సంబంధిత వార్తలు
- పెళ్లి పీటలెక్కబోతున్న హ్యాపీ వెడ్డింగ్ హీరో.. వాలెంటైన్స్‌డే కు?
- హీరో సుమంత్ విడుదల చేసిన సముద్ర `జైసేన` లిరికల్ వీడియో సాంగ్
- రోడ్ జర్నీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న 'ఇదే మా కథ'
- సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, తాన్యా హోప్ చిత్రంలో జాయిన్ అయిన భూమిక
- `నన్ను ఎన్.టి.ఆర్. అంటారు` అని చెప్పగానే... ఎన్టీఆర్ గురించి వైష్ణవ్ తేజ్
`అనగనగా ఓ రౌడీ`గా సుమంత్
Sumanth, Anaganaga o rowdy
మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోత్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది.
వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది. వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్.కె.రాబిన్, సహ నిర్మాత: విజయ్.కె.బి, రచన, దర్శకత్వం: మను యజ్ఞ.
