సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (18:24 IST)

పెళ్లి పీటలెక్కబోతున్న హ్యాపీ వెడ్డింగ్ హీరో.. వాలెంటైన్స్‌డే కు?

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలో పెళ్ళిపీటలు ఎక్కబోతున్నాడు. నిర్మాత ఎమ్మెస్ రాజు తన కుమారుడు సుమంత్ పేరు మీదే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి, పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత దర్శకుడిగానూ మారారు. 
 
అలా తన దర్శకత్వంలో 'తూనీగ తూనీగ' మూవీ ద్వారా కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేశారు. ఆపైన సుమంత్ 'అంతకు ముందు ఆ తర్వాత, లవర్స్, కేరింత, కొలంబస్, రైట్ రైట్, ఫ్యాషన్ డిజైనర్, హ్యాపీ వెడ్డింగ్' తదితర చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ఒకటి రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
 
ఇదిలా ఉంటే... ఇటీవల తమ బంధువుల అమ్మాయి, డల్లాస్ లో ఎమ్మెస్ చేసిన చి.ల.సౌ. దీపికతో సుమంత్ వివాహాన్ని ఎమ్మెస్ రాజు దంపతులు ఖరారు చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ శివారల్లో వీరి వివాహం రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో జరుగబోతోంది. మొత్తానికి టాలీవుడ్‌కు చెందిన మరో ఎలిజిబుల్ బ్యాచిలర్ సుమంత్ అశ్విన్, వాలెంటైన్స్‌డే కు ఒక్క రోజు ముందు పెళ్ళి పీటలు ఎక్కుతుండటం విశేషం.