శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:55 IST)

పెళ్లయ్యాక నిహారిక ఎలా వుందంటే, నాగబాబు రియాక్షన్ (video)

నిహారికకు ఈ మధ్యనే వివాహం చేశారు నాగబాబు. ఎంతో ఆర్భాటంగా పెళ్ళి జరిగింది. మెగా బ్రదర్స్ మొత్తం ఈ పెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు. కుమార్తెకు వివాహం చేసిన తరువాత నాగబాబు తన కుమార్తెకు మధ్య మాటలు తగ్గాయని అంటున్నారు.
 
నిహారిక అంటే నాకు ఎంతో ఇష్టం..ప్రాణం. కుమార్తె కావాలని నేను దేవుడిని వేడుకున్నా. అందుకే నాకు కూతురు పుట్టింది. నిహారికను చిన్నప్పటి నుంచి ఎలాంటి బాదరాబందీ లేకుడా పెంచాను. ఇప్పుడు పెళ్ళి చేసి పంపించాను. నిహారికకు కూడా నేనంటే మరింత ఇష్టం.
 
కానీ పెళ్ళయిన తరువాత నిహారిక నాతో మాట్లాడటం కాస్త తగ్గించేసింది. అంతేకదా.. పెళ్లయ్యాక ఏ ఆడపిల్లయినా మెట్టినింటికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. తల్లిదండ్రులకు సహజంగానే క్రమంగా డిస్టెన్స్ పెట్టేస్తుంది. ఇది అందరి తల్లిదండ్రులకు మామూలే.
 
ఇక వరుణ్ తేజ్ పెళ్ళి ఎప్పుడని అడిగితే మాత్రం అది అతని నిర్ణయమే అంటున్నారు నాగబాబు. మంచి అమ్మాయిని చూస్తున్నాం.. వరుణ్ తేజ్‌కు ఇష్టమైతే పెళ్ళి చేసేస్తామని చెప్పాడట నాగబాబు.