1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tammareddy Bharadwaj Comments on Chiranjeevi

దాసరికి వారసుడు చిరంజీవి : తమ్మారెడ్డి భరద్వాజ

తెలుగు చిత్రపరిశ్రమలో సమస్యల పరిష్కారానికి దాసరి నారాయణ రావుకు వారసుడు చిరంజీవి అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా పెద్ద దిక్కుగా మాకు ఉన

Tammareddy Bharadwaj
తెలుగు చిత్రపరిశ్రమలో సమస్యల పరిష్కారానికి దాసరి నారాయణ రావుకు వారసుడు చిరంజీవి అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా పెద్ద దిక్కుగా మాకు ఉన్నారంటూ ప్రతి ఒక్కరూ దాసరి నారాయణ రావుగారిని ఆశ్రయించేవారు. ఇపుడు అలాంటి వారు ఎవరున్నారన్న ప్రశ్నకు తమ్మారెడ్డి స్పందించారు. 
 
దాసరి జీవించివున్న సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ప్ర‌తి స‌మ‌స్య‌నీ త‌న సమస్యగా భావించేవారు. దాని పరిష్కారం కోసం పాటుపడేవారు. సినీ ప‌రిశ్ర‌మ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆయ‌న ముందుండి న‌డిపించారు. చిన్న సినిమాల‌కు నేనున్నానంటూ ఆయన ధైర్యంగా భరోసా ఇచ్చిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. 
 
దాసరి నారాయణ రావు లేకపోయినప్పటికీ ఆయన వారసుడిగా దాస‌రికి చిరంజీవి రూపంలో ఓ ప్ర‌త్యామ్నాయం క‌నిపిస్తోంది. దాస‌రిలా చొర‌వ తీసుకుని, అంద‌రినీ క‌లుపుకుపోయే గుణం ఒక్క చిరంజీవిలోనే ఉందన్నారు. ఇటీవల దాస‌రిపై పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు రాసిన 'తెర వెనుక దాస‌రి' పుస్తకంను స్వయంగా చిరు విడుదల చేయడమే కాకుండా, ఆ ఫంక్షన్‌కి అయిన ఖ‌ర్చంతా చిరునే భరించారని చెప్పారు. 
 
ఇలాంటి గుణం ఒక్క దాసరిగారిలోనే ఉందన్నారు. అలాంటి గుణమే ఇప్పుడు నాకు చిరంజీవిలో క‌నిపిస్తోంది. ఆయన చాలా మెత‌క స్వ‌భావి. ఎవరితోనూ గొడ‌వ‌లు పెట్టుకోవ‌డం ఇష్టం ఉండ‌దు. పైగా దాస‌రిలా అనుభ‌వ‌జ్ఙుడు. అలాంటి చిరంజీవి, దాస‌రిగారిలా ప‌రిశ్ర‌మని త‌న భుజాల‌పై వేసుకుని నడిపించగలడని నా అభిప్రాయమని చెప్పుకొచ్చాడు.
About Writer
selvi
తర్వాతి కథనం
అజ్ఞాతవాసిలో పవన్-ఖుష్బూ పవర్ ఫుల్ లుక్ ఇదే (ఫోటో)