శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (19:44 IST)

దర్శకుడు సుకుమార్‌ను చెడామడా తిట్టేసిన మెగాస్టార్.. ఎందుకు?

ఏంటి.. సుకుమార్.. నీకొక బాధ్యతను అప్పగించాము. ఆ బాధ్యతను అంతకు రెట్టింపుగా నెరవేర్చాలి. రంగస్థలం సినిమాలో రాంచరణ్‌‌కు మంచి పేరు వస్తుంది, ఆ కథ చాలా బాగుంది అనుకుంటే మీరు అలా చేయడంలేదు. సినిమా చేస్తున్నామంటే ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. ఎలాపడితే అలా చేస్

ఏంటి.. సుకుమార్.. నీకొక బాధ్యతను అప్పగించాము. ఆ బాధ్యతను అంతకు రెట్టింపుగా నెరవేర్చాలి. రంగస్థలం సినిమాలో రాంచరణ్‌‌కు మంచి పేరు వస్తుంది, ఆ కథ చాలా బాగుంది అనుకుంటే మీరు అలా చేయడంలేదు. సినిమా చేస్తున్నామంటే ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. ఎలాపడితే అలా చేస్తే ఇక సినిమా విజయవంతం ఎలా అవుతుంది... అంటూ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సుకుమార్‌ను చెడామడా తిట్టేశారట. 
 
1985వ సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు సుకుమార్ రాంచరణ్‌తో రంగస్థలం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 75 శాతంకు పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఆ పార్టు మొత్తాన్ని చిరంజీవి చూశారు. అది కూడా రాంచరణ్‌ కోరడంతోనే చిరంజీవి సినిమా చూశారట. అయితే అందులో కొన్ని సన్నివేశాలు చిరంజీవికి అస్సలు నచ్చలేదట. 
 
డీ-గ్లామర్ అంశాలే ఎక్కువగా అందులో ఉండటంతో వాటిని తగ్గించమని సుకుమార్‌కు సలహా ఇచ్చాడట. బాగా రాని సీన్స్‌ను మళ్ళీ చేయమని సుకుమార్‌కు సూచించారట చిరంజీవి. దీంతో సుకుమార్ మళ్ళీ కొన్ని సీన్లను తీస్తానని చెప్పారట.