గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 25 నవంబరు 2017 (18:50 IST)

నేను శాడిస్ట్‌నా - వారిని దేవుడే శిక్షిస్తాడు... వేణుమాధవ్

అధికార తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడూ వైసిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు కమెడియన్ వేణుమాధవ్. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా తెలుగు సినీపరిశ్రమలో వేణు మాధవ్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆయన గతంలో నటించిన సినిమాలు అలా

అధికార తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడూ వైసిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు కమెడియన్ వేణుమాధవ్. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా తెలుగు సినీపరిశ్రమలో వేణు మాధవ్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆయన గతంలో నటించిన సినిమాలు అలాంటివి మరి. వేణుమాధవ్ అంటే ఒక క్రేజ్ ఉన్న కమెడియన్. వేణు చెప్పే డైలాగులు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. సహజశైలిలో ఉన్న ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాల్లో వేణుమాధవ్ ఇలా ఉంటే నిజజీవితంలో చాలా కర్కశంగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
 
సహ నటులే వేణుమాధవ్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం కాస్త వేణుమాధవ్ దృష్టికి వచ్చింది. అదేంటంటే పిల్లికి కూడా వేణుమాధవ్ భిక్షం పెట్టరట. ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతారట. కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా వెళితే నేను కష్టపడటం లేదా అని ప్రశ్నిస్తాడు. ఇలా శాడిస్టు బుద్ధులు ఎక్కువగా వేణుమాధవ్‌కు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీన్ని పూర్తిగా ఖండించారు వేణు. నా గురించి అలా చెప్పే వారిని దేవుడే శిక్షిస్తాడు. 
 
నేను మంచివాడినేనని ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. సహ నటులు కష్టాల్లో వుంటే వెంటనే నాకు తోచిన సాయం నేను చేస్తుంటాను. ఏదైనా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదనుకుంటే వారి నుంచి తప్పించుకుని తిరుగుతాను అంతేతప్ప డబ్బులు అడుగుతాను.. పిల్లికి భిక్షం పెట్టను అని చెబుతున్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు వేణు మాధవ్.