సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chj
Last Modified: శనివారం, 11 నవంబరు 2017 (20:46 IST)

నా వయస్సు పెరిగిందా.. ఏం మాట్లాడుతున్నారు.. కాజల్ అగర్వాల్ ఫైర్

మూడు పదుల వయస్సు పెరిగిందా నాకు.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నన్ను చూస్తే అలా అనిపిస్తున్నానా. గ్లామర్‌గా వయస్సు తక్కువగా కనిపించడం లేదా.. ఇక అలా చెప్పడం మానుకోండి.. ఇదంతా ఎవరో కాదు చెప్పింది. నటి కాజల్. అగ్ర హీరోయిన్‌గా ఉన్న కాజల్ ఇప్పుడు వయస్సు పైపడ

మూడు పదుల వయస్సు పెరిగిందా నాకు.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నన్ను చూస్తే అలా అనిపిస్తున్నానా. గ్లామర్‌గా వయస్సు తక్కువగా కనిపించడం లేదా.. ఇక అలా చెప్పడం మానుకోండి.. ఇదంతా ఎవరో కాదు చెప్పింది. నటి కాజల్. అగ్ర హీరోయిన్‌గా ఉన్న కాజల్ ఇప్పుడు వయస్సు పైపడిందని కొంతమంది స్నేహితులు ఆటపట్టిస్తుంటే అస్సలు ఊరుకోవడం లేదట. వారిపై కోపంతో ఊగిపోతోంది. 
 
నా వయస్సు చాలా తక్కువ. ఇంతకుముందు కన్నా స్లిమ్‌గా తయారయ్యా. చాలా అందంగా ఉన్నా. నన్ను ఎప్పుడూ దయచేసి అలా మాట్లాడవద్దండి అంటూ స్నేహితులకు రెండు చేతులు జోడించి దణ్ణం పెడుతోంది కాజల్. గత కొన్నిరోజులుగా కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఎం.ఎల్.ఎ సినిమాలో నటిస్తున్న కాజల్‌కు కాస్త తీరిక సమయం దొరుకుతోంది. 
 
సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి అలా బయటకు వెళుతోంది. అప్పుడు స్నేహితులు కాజల్‌ను ఆటపట్టిస్తున్నారు. వయస్సు దాటిపోవడం వల్లే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఇక సినిమాలు తగ్గిపోయాయా కాజల్ అంటుంటే కాజల్ జీర్ణించుకోలేకపోతోందట. పైగా తన తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారంటూ చెప్పుకొస్తోందట.