1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Ranga Reddy : A Young Man Committed Suicide After Being Hit By A Train

తమ్మూడు.. అమ్మానాన్నిని బాగా చూసుకో...

suicide
ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ బలవన్మరణానికి పాల్పడే ముందు యువకుడు. వాట్సాప్‌‍లో పెట్టుకున్న ఓ స్టేటస్ ఇపుడు కన్నీరు తెప్పిస్తోంది. 'నాకు ఈ లోకాన్ని వదిలి వెళ్లాలని లేదురా.. చాలా ఏడుపొస్తోంది. అమ్మానాన్నని బాగా చూసుకో' అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్‌ పట్టణ సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. 
 
వికారాబాద్‌ రైల్వే పోలీస్‌ ఎస్ఐ సురేష్‌ వెల్లడించిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్కేపల్లికి చెందిన దేవన్న, నిర్మలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సిద్ధన్న(29) స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేస్తుంటాడు. 
 
కోహీర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో బెంగళూరు - నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రైల్వేట్రాక్‌పై మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన ట్రాక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు విలపించారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నవంబరు 14 రెండో శనివారం పని దినమే : స్పష్టం చేసిన ఏపీ సర్కారు